శ్రీరెడ్డి బయోపిక్ విడుదల ఎప్పుడంటే ?

నటి శ్రీరెడ్డి జీవితకథతో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘రెడ్డి డైరీస్’ పేరుతో శ్రీరెడ్డి బయోపిక్ రాబోతుంది. ఈ చిత్రానికి డాక్టర్ అలాదీన్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిదేవన్ నిర్మిస్తున్నారు. శ్రీరెడ్డి పాత్రలో ఆమె స్వయంగా నటిస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక దోపిడీ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి శ్రీరెడ్డిని మోసం చేసిన కొందరు వ్యక్తుల పేర్లను కూడా సినిమాలో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. శ్రీరెడ్డి అనుభవాలతో పాటు ఆమె దగ్గర మరికొంతమంది ఓపెన్ అయిన విషయాలను కూడా సినిమా ద్వారా బయటపెట్టనున్నారు. అలెప్పీ, గోవాలలో సినిమా అత్యకభాగం చిత్రీకరించారు. రెడ్డి డైరీస్ ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

శ్రీరెడ్డి నోరు తెరిస్తేనే సంచలనాలు.. ఇక ఆమె బయోపిక్ అంటే మాటలా.. ? ఇండస్ట్రీలో ఎంతమంది బండారాలు బయటపడతాయో చూడాలి.