ఉపాసన ప్రేమలో శ్రీరెడ్డి


వివాస్పద నటి శ్రీరెడ్డి ఎక్కువగా టార్గెట్ చేయడమే ఉంటుంది. ఆమె నుంచి ప్రేమగా మాటలని ఆశించలేం. అలాంటి శ్రీరెడ్డి మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసనని ఇష్టపడుతోంది. మెగా ఫ్యామిలిలో నేనొకరిని ఎంతో ప్రేమిస్తాను,మచ్చలేని మనిషి, స్ఫూర్తిప్రదాత, ఎవరో చెప్పగలరా..? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మెగా ఫ్యామిలిలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరో మీరే చెప్పండని ఓ పోల్ పెట్టింది. ఈ పోల్ లో పాల్గొన్నవారంతా.. మెగా హీరోల పేర్లని పెట్టారు.

వారెవరూ నా ఫేవరేట్ కాదన్న శ్రీరెడ్ది.. మెగాస్టార్ ఇంటి కోడలు ఉపాసన పేరు చెప్పింది. ఉపాసనను తనకు ఎంతో దగ్గరైన వ్యక్తిగా భావిస్తానని, గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ఐతే, దీని వెనక శ్రీరెడ్డి టార్గెట్ ఏదైనా ఉండొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.