వెంకీ మామపై శ్రీరెడ్డి అలక


వెంకీ మామపై వివాదాస్పదన నటి శ్రీరెడ్డి అలకబూనింది. వెంకీ అన్నయ్య సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ శ్రీరెడ్డి వాడుకొని వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శ్రీరెడ్డి పెద్ద రచ్చే చేసింది. ఫైనల్ గా సురేష్ బాబుతో ఓ డీల్ కుదుర్చుకొని సలైంట్ అయిపోయినట్టు వార్తలొచ్చాయ్. అయినా.. అప్పుడప్పుడు సురేష్ బాబు కుటుంబంతో చాలా అనుబంధం ఉన్నట్టుగా మాట్లాడుతుంటుంది. ఆమె తొలిసారి వెంకటేష్ ని టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి.

ఇందులో వెంకటేష్ తన కూతురి పెళ్ళికి తనను పిలవలేదంటూ తెగ ఫీల్ అవుతూ మెలికలు తిరిగిపోయింది. వెంకటేష్ ను చిన్న మామయ్య అంటూ… వెంకటేష్ గారి కూతురి పెళ్లికి తనకు కార్డ్ ఇవ్వలేదని. అఫీషియల్ గా తను కోడలు కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కోడల్నే కదా అని, తనను పిలిస్తే ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని అని, వెంకీ కూతురు చేసుకోబోయే అబ్బాయి రెడ్డీస్ అని తెలిపింది. వెంకీకి కంగ్రాట్స్ చెబుతూ మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని ఓ అభిమానిగా కోరుకుంటున్నా’నని తెలిపింది.