‘సుయి ధాగా’ ఫస్ట్ లుక్

దర్శకుడు శరత్‌ కఠారియా దర్శకత్వంలో వరుణ్‌ధావన్‌ – అనుష్కశర్మ జంటగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ చిత్రం ‘సుయి ధాగా’. ఈ చిత్రం మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా, వ‌రుణ్ ధావ‌న్, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు క‌లిసి ఉన్న ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూతికి మీసంతో వ‌రుణ్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తుండ‌గా, అనుష్క శారీ ధ‌రించి చిరున‌వ్వు తో ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ సినిమా కోసం వరుణ్ ధావన్ మిషన్ కుట్టడం నేర్చుకుంటే, అనుష్క శర్మ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటోంది.
ఈ సినిమాని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.