తాత కోసం.. తాత కారులో !


క్రిష్ దర్శకత్వంలో నట సార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్ టీఆర్ చిత్రం స్టార్స్ తో నిండిపోతుంది. బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. సావిత్రిగా కీర్తి సురేష్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబుగా నారా నటిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు గెటప్‌లో రానా లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు నుంచి ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుంది. ఈ విషయాన్ని సుమంత్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫొటోను పంచుకున్నారు. ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రలో నటించడానికి ఆయన వాడిన ఆఖరి కారులో నా తొలిరోజు షూటింగ్‌ను వెళ్తున్నా.’ అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. వచ్చే యేడాది సంక్రాంటి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.