సునీల్ కమెడియన్’గా.. మరోటి !

సునీల్.. అటు హీరోగా, ఇటు కమెడియన్ గా కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. కమెడియన్ గా స్వింగులో ఉండగా హీరోగా టర్న్ తీసుకొన్నాడు సునీల్. ఒకట్రెండు హిట్స్ పడేసరికి.. పూర్తిగా హీరో అయిపోయానని కామెడీ వేషాలు మానేశాడు. ఐతే, హీరోగా వరుస ప్లాపులు పలకరించేసరికి.. మళ్లీ కమెడియన్ రీ-ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. అరవింద సమేత, అమర్ అక్భర్ ఆంథోనీ సినిమాల్లో కమెడియన్ గా నటించిన.. సునీల్ పాత్రకి పెద్దగా పేరు రాలేదు.

తాజాగా, సునీల్ కి ఓ మంచి అవకాశం వచ్చినట్టు సమాచారమ్. యాక్షన్ హీరో గోపీచంద్ కోసం సంపంత్ నంది ఓ మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. గోపిచంద్ కి కూడా సంపత్ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చి వెంటనే సినిమాని పట్టాలెక్కించాలని డిసైడ్ అయిన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో గోపీచంద్ తో మరో కీ క్యారక్టర్ కూడా ఉందట. సినిమా మొత్తం హీరోతో పాటు ఉండే ఆ పాత్ర, సునీల్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించి సునీల్ సంప్రదించడం.. ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయినట్టు తెలుస్తోంది.