లైంగిక వేధింపులపై సునీత ఏమన్నారంటే ?

sunitha

ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు విషయం పై విస్తృత చర్చసాగుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. అనే తేడానే లేదు. ఇండస్ట్రీ చీకటి కోణంపై సీనియర్, యంగ్ హీరోయిన్స్ స్పందిస్తున్నారు. #Metoo (మీటూ) కు మద్దతుపలుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాదు పోలీసులు నిర్వహించిన ‘జాగో బదలో బోలో’ యువతుల చైతన్య కార్యక్రమానికి సింగర్ సునీత హాజరయ్యారు.

లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు అడ్డువస్తున్నాయి. దీని వల్ల వేధింపులకు గురవుతున్న చిన్నారులు దానిపై బయటకు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇకపై అలా జరగకూడదు. ప్రతి ఆడపిల్ల తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాలని సునీత సూచించారు. లైంగిక వేధింపులు, దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని పిలుపునిచ్చింది.