‘యాత్ర’పై మెగా దర్శకుడి కామెంట్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ చిత్రానికి మహి. వి రాఘవ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యాత్ర’ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. దర్శకుడు మహి వైఎస్ఆర్ పాద’యాత్ర’ని బాగా డీల్ చేశారు. కథని ఎమోషనల్ గా చూపించారని ప్రశంసలు కురుస్తున్నాయి.

తాజాగా, దర్శకుడు సురేందర్ రెడ్డి యాత్రపై స్పందించారు. ‘యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్‌ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్‌ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు సూరీ.

‘ధృవ’ సినిమాతో రామ్ చరణ్ కి హిట్ ఇచ్చిన సురేంధర్ రెడ్ది.. ప్రస్తుతం మెగాస్టార్ 151 చిత్రం ‘సైరా’కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సైరా ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు రానుంది.