సైరా – వీరారెడ్డి లుక్ చూసారా..?

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి , జగపతిబాబు , సుదీప్ , విజయ్ సేతుపతి వంటి స్టార్ నటి నటులు నటిస్తుండగా , తాజాగా ఈరోజు జగపతి బాబు పుట్టిన రోజు సందర్భాంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో జగపతి బాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చి ఆకట్టుకున్నాయి.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.