మిల్కీ బ్యూటీ సైడ్ బిజినెస్..

సినిమా రంగంలో కాస్త సంపాదించిగానే హీరో , హీరోయిన్లు సొంత వ్యాపారంలో అడుగుపెట్టడం చేస్తుంటారు..తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తాజాగా సైడ్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలం గా సరైన అవకాశాలు లేని ఈమె ఇక సినిమాలను నమ్ముకుంటే బాగోదని గ్రహించి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యిందట.

వినాయక చవితి రోజున తమన్నా డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రకటించింది. తల్లిదండ్రులకు తను ఇచ్చే కానుక ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు చాలామంది నటి నటులు ఎన్నో వ్యాపారాలు మొదలు పెట్టారు కానీ వజ్రాల వ్యాపారం లో మాత్రం అడుగుపెట్టలేదు. ఇలా వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సౌత్ నుంచి మొదటి హీరోయిన్ తమన్నే అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో వెంకీ సరసన ఎఫ్-2 అనే సినిమా చేస్తోంది. మరోవైపు ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి (క్వీన్ రీమేక్) విడుదలకు సిద్ధమైంది.