హీరోగా మారబోతున్న తరుణ్ భాస్కర్..

డైరెక్టర్ గా సత్తా చాటుకున్న తరుణ్ భాస్కర్ త్వరలో హీరోగా మారబోతున్నాడా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు . ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన..మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్ తెచ్చుకున్నాడు. తాజాగా తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమా అంత విజయం దక్కలేదు కానీ ప్రశంసలు మాత్రం అందాయి.

తాజాగా తన మొదటి సినిమా హీరో నిర్మాణంలో ఈయన హీరోగా మారబోతున్నాడట. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో స్టార్ హీరో అయినా విజయ్ తాజాగా సొంత నిర్మాణం మొదలు పెడుతున్నారు. ఈ బ్యానర్ లో రూపొందబోయే మొదటి సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఈ చిత్రాన్ని ఒక తమిళ దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.