టీజర్ రివ్యూ: ‘నన్ను దోచుకుందువటే’


సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’. ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకత్వం. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేశారు. టీజర్ ని బట్టి చూస్తే హీరో సుధీర్‌బాబు ఓ కంపెనీకి మేనేజర్ గా, హీరోయిన్ నభా నటేశ్ ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలలో కనిపించారు.

సుదీర్ వస్తున్నాడంటే చాలు అందరూ భయంతో వణికిపోతున్నారు టీజర్ లో. ఇక ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సిరి’ అంటూ కథానాయిక తనని తాను పరిచయం చేసుకునే సన్నివేశాలు సరదా సరదాగా నవ్వులు పంచుతున్నాయి. మరి ఆఫీస్‌లో చాలా స్ట్రిక్ట్‌ అయిన కార్తీక్‌ జీవితంలోకి సిరి ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘సిరి నాకు ముందు నుంచే తెలుసా?’ అని సుధీర్‌బాబు వేణును అడిగితే ‘మీరే కదా సర్‌ సిరిమ్మతో రోజూ మాట్లాడతారు’ అని వేణు చెప్పడం. ‘ఒరేయ్‌! ఇడియట్‌ అది ఐఫోన్‌లో ఉండే సిరిరా’ అని సుధీర్‌ మండిపడటం ఫన్నీగా వుంది.