పవన్ కథతో తేజు సినిమా ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో జనసేన త్రిముఖ పోటీకి రెడీ అవుతోంది. భవిష్యత్ లో ఏమోగానీ.. ఇప్పట్లో పవన్ సినిమాలు చేసే ఛాన్స్ లేదు. వాస్తవానికి అజ్ఝాతవాసి తర్వాత మరో సినిమా చేయాల్సి ఉంది. ఏ.ఎం.రత్నం నిర్మాతగా పవన్ చేయాల్సి ఉంది. సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈలోగా పవన్ రాజకీయాల్లోకి రావడం… ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయింది.

ఇప్పుడీ సినిమాని పవన్ మేనల్లుడు, మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు అనుకొంటున్నారంట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కథకి తేజు ఏ మేరకు న్యాయం చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇక, గతకొన్నాళ్లుగా ప్లాపుల్లో ఉన్న తేజు ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ రావాలని ఆశపడుతున్నారు.