తారక్ టెంపర్’కు మూడేళ్లు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుమించి నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. ఇదీగాక, అప్పటికే వరుస ప్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి సత్తాని మరోసారి నిరూపించిన చిత్రమిది.

ఇప్పుడీ సినిమా రిలీజై మూడేళ్లు పూర్తికావొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘టెంపర్‌.. నా సినిమాల జాబితాలో గర్వంగా చెప్పుకునే సినిమా. నటుడిగా తారఖ్ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాడు. కథ అందించిన వక్కంతం వంశీకి, ఘనవిజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్‌ చేశాడు పూరి.

టెంపర్ ఇప్పుడు బాలీవుడ్ లో రిమేక్ కాబోతుంది. రన్ వీర్ సింగ్ – జాన్వీ కపూర్ జంటగా కరణ్ జోహార్ టెంపర్ ని రిమేక్ చేస్తున్నారు.