విజయ్ సినిమాలో హీరోయిన్’గా సీరియల్ నటి


‘పెళ్లి చూపులు’ సినిమాతో.. తనకి తొలి హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ యాంకర్ అనసూయ నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఐతే, తాను హీరోయిన్ ని కాదు. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నానంతేనని అనసూయ గతంలోనే క్లారిటీ ఇచ్చింది.

తాజాగా, తరుణ్ భాస్కర్ కు హీరోయిన్ సెట్టయింది. తమిళ సీరియల్ నటి వాణి భోజన్ ను సెలెక్ట్ చేశారు. దేవమగళ్ సీరియల్ తో తమిళనాడులో సూపర్ ఫేమస్ అయ్యింది వాణి భోజన్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారమ్. అదే జరిగితే.. ఈ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.