#RRRలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ?


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఓ హీరోయిన్ గా కనిపించనుంది. ఆమె రామ్ చరణ్ కి జంటగా కనిపిస్తారు. వీరేకాకుండా.. మరికొందరు బాలీవుడ్ నటీనటులు ఆర్ ఆర్ ఆర్ లో కనిపించబోతున్నట్టు సమాచారమ్.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరియు వరుణ్ ధావన్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు ప్రచారం మొదలైంది. దీనిపై రాజమౌళి అండ్ టీం ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది.