చరణ్ కు ఉపాసన సినిమా చూపిస్తుందట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన భార్య సినిమా చూపిస్తుందట. అలాగని టార్చర్ పెడుతుందని కాదు. చరణ్ అంటే ఉపాసనకు అమితమైన ప్రేమ. మిస్టర్ సి గురించి ఆసక్తికరమైన విషయాలని మెగా అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది ఉపాసన. ఎప్పుడు పాజిటివ్ గా ట్విట్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ.. ‘ తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆమె వల్లే తాను కామెడీ సినిమాలు చూస్తున్నా. ఈ విషయంలో ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి’ అన్నారు.

ఇక, తనకు బయోపిక్ సినిమాలంటే చాలా ఇష్టమని చరణ్ తెలిపాడు. బయోపిక్ లలో నిజాలు ఉంటాయి. అందుకే అవి తనకు నచ్చుతాయని చెప్పాడు. అయితే, బయోపిక్ లో నటించే అవకాశం తనకు వస్తే… ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేననన్నాడు. ‘సంజు’ సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగా నచ్చిందని కితాబిచ్చాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కైరా అద్వాణీ నటిస్తోంది