రాజమౌళి చేతిలోకి ‘ఉయ్యాలవాడ’ !

Making Mahabharata into a movie is my dream, says SS Rajamouli
Making Mahabharata into a movie is my dream, says SS Rajamouli

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిరు పుట్టినరోజు ఆగస్టు 22న ఉయ్యాలవాడని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఉయ్యాలవాడ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలోనూ ‘ఉయ్యాలవాడ’ని తీసుకొస్తున్నట్టు సమాచారమ్. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి స్వాతంత్రోధ్యమకారుడు. 1847లోనే బ్రిటీష్ వాళ్లపై తిరగబడిన ధీరుడు. బ్రిటీష్ వాళ్లకి చెమటలు పట్టించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నయనతారని ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. మలయాళ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్ లు ఉయ్యాలవాడలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.