నటుడు వంకాయల సత్యనారాయణ ఇకలేరు

సినీ నటుడు వంకాయల సత్యనారాయణ ఈ ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా విశాఖలోని తన కుమార్తె వద్ద ఉంటున్నారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం మృతి చెందారు. ఆయన 160కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. వంకాయల మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి.

వంకాయల సత్యనారాయణ గురించి మరికొన్ని :

* 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్‌ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు

* 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.

* 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్నారు.

* 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.

* బి.కాంలో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.