కేసీఆర్ బయోపిక్’పై వర్మ లెటెస్ట్ కామెంట్


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ పోస్టర్ ని వదిలిన వర్మ.. ఈ బయోపిక్ పై ఓ పాట కూడా పాడారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా, కేసీఆర్ బయోపిక్ పై వర్మ వివరణ ఇచ్చారు.

“తాను తీయబోయే కేటీఆర్ బయోపిక్… ఆంధ్రప్రజలకు వ్యతిరేకంగా ఉండదు. తెలంగాణా ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్ కేసీఆర్’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందరినీ కేసీఆర్ ప్రేమించారని, ఆయన యుద్ధం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదే”నని వర్మ ట్విట్ చేశారు.