తమిళ్ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది !

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. విజయ్ కి జంటగా షాలినీ పాండే నటించింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ , కోలీవుడ్ లో రిమేక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళం అర్జున్ రెడ్డి ‘వర్మ’ పేరుతో బాల తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ నటిస్తున్నాడు. మేఘా కథానాయిక.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ ఫుట్‌బాల్‌ ఆడితే, ఇందులో ధ్రువ్‌ హాకీ ఆడుతూ కనిపించాడు. ఆస్పత్రిలో సర్జరీ, బులెట్‌పై వెళ్లే సన్నివేశాలు అర్జున్ రెడ్డిని గుర్తుకు తెస్తాయి. విజయ్ లుక్ తో పోలిస్తే ధృవ తేలిపోయినట్టు కనబడుతోంది. వర్మ ట్రైలర్ ని మీరు ఓసారి చూసేయండీ.. !

Attachments area
Preview YouTube video VARMAA Official Trailer | Dhruv Vikram | Director Bala | Megha | Varma Tamil Movie 2019