వరుణ్ తేజ్ ఖజికిస్థాన్ టూర్ వెనక

గత యేడాది ‘ఫిదా’, ఈ యేడాది ‘తొలిప్రేమ’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’పై ప్రేక్షకులు, ఇండస్ట్రీ ప్రశంసలు కురిపిస్తోంది. తొలిప్రేమ తర్వాత కూడా విభిన్నమైన సినిమాని ఎంచుకొన్నాడు వరుణ్. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

అతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజు ముందస్తు శిక్షణ తీసుకోనున్నాడు. ఇందుకోసం ఖజికిస్థాన్ వెళ్లనున్నాడు. సహజంగా ఉండేందుకు జీరో గ్రావిటిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందుకోసం కృత్రిమ జీరో గ్రావిటి వాతావరణంలో వరుణ్‌ శిక్షణ తీసుకోనున్నారు. ఇందుకోసం ఖజికిస్థాన్‌ వెళ్లనున్నట్టు సమాచారమ్.