వెంకయ్య మెచ్చిన మహర్షి


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన చిత్రం మహర్షి. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకొంది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తాజాగా, మహర్షి బాగుందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కితాబిచ్చాడు. ట్విట్టర్ వేదిక మహర్షి సినిమాని ప్రశంసిస్తూ.. మహేష్, దర్శకుడు వంశీ, చిత్రబృందానికి కృతజ్ఝతలు తెలిపారు.

“మహర్షి సినిమాని కుటుంబంతో కలిసి చూశా. ఇది ఎంతో అద్భుతమైన చిత్రం. చిత్రంలో మహేష్ నటన భేష్. సహజమైన నటనతో మహేష్ చక్కని ప్రతిభ కనబర్చారు. రైతు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తు చేశారు”

“గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ అన్నదాత ఆవశ్యకతను తెలిపిన ప్రభోదాత్మక చిత్రం మహర్షి. ప్రతీ ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అంటూ వరుస ట్విట్లు చేశారు వెంకయ్య నాయుడు.