వేణు మాధవ్ మళ్లీ గర్జించాడు

venu (2)

నంద్యాల ఉప ఎన్నికలో కమెడియన్ వేణు మాధవ్ మరోసారి గర్జించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ షో ప్రారంభించారు. రోడ్ షోలో సీఎం ప్రక్కనే ఉన్న వేణు మాధవ్ తనదైన మార్క్ తో ప్రజలని ఆకట్టుకొన్నాడు. సీఎం చంద్రబాబు ప్రసంగానికి ముందు ఒకట్రెండు సినిమాలు మాట్లాడిన వేణు మాధవ్ జగన్ పై విరుచుకుపడ్డారు. ‘ఒకడేమో నాకు చానల్ లేదు, పేపర్ లేదని అంటున్నాడు. మరి ఆ చానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్’ అన్నారు.

తాను ఎవరినీ విమర్శించను. విమర్శించే అలవాటు తనకు లేదు. నా బిడ్డలైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడతానన్నారు వేణు మాధవ్.

కర్నూలు జరుగుతోన్న అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తి చేసిన వేణుమాధవ్.. నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమన్నారు. సీఎం చంద్రబాబు మెజారిటీ ఏ రేంజ్ లో ఉందనుందో చూడటానికే ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు.