నీచం : హీరోయిన్ ముందే హస్త ప్రయోగం.. !!

vidya

దేశంలో ‘నిర్భయ’ చట్టం తీసుకొచ్చినా.. మహిళలపై అరాచకాలు ఆగడం లేదని పలు రిపోర్టులు చెబుతూనే ఉన్నాయి. అయితే, నిర్భయ చట్టం లేని రోజుల్లో, మీడియా ఇంత పవర్ ఫుల్ గా లేని రోజుల్లో వెలుగులోకి రాణి రాని అరాచకాలు కోకొళ్ల‌లు అని చెప్పాలి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె కాలేజీ రోజుల్లో ఉండగా జరిగిన నీచమైన సంఘటన ఇది.

ముంభైలోని జేవీయర్స్ కాలేజీలో విద్యాబాలన్ చదువుకొంటోంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రైయిన్ లో లేడీస్ కంపార్ట్ మెంట్ లోకి ఓ యువకుడు ఎక్కాడట. ఇది లేడీ కంపార్ట్ మెంట్ అని గుర్తు చేయగా.. నెక్ట్స్ స్టాప్ లో దిగిపోతానని చెప్పాడట. అయితే, ఆలోపు అమ్మాయిల ముందు కూర్చోని తెగ పోజులు కొట్టాడట. చివరికి నెక్ట్స్ స్టాప్ లో కూడా దిగకుండా.. అమ్మాయిల ముందే నీచంగా హస్త ప్రయోగం చేసుకోవడం మొదలెట్టాడు. అప్పుడు చిర్రెత్తుకొచ్చిన విద్యాబాలని ఆ యువకుడిని లాక్కొని ట్రైయిని డోర్ వద్దకు తీసుకొచ్చిందట. దెబ్బకు భయపడిన ఆ యువకుడు నెక్ట్స్ స్టాప్ లో దిగిపోయాడట.

అప్పుడు కాలేజీ అమ్మాయిగా ఉన్న విద్యాబాలన్ ఇప్పుడు బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ గా ఎదిగింది. మహిళలపై జరుగుతున్న అరాచకాలని ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంది.