ప్రభాస్ కంటే విజయ్ దేవరకొండే బెటర్…

అతి తక్కువ టైములో క్రేజీ హీరో అనిపించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. కేవలం మూడు సినిమాలతోనే అగ్ర హీరో అయ్యాడు. ప్రస్తుతం విజయ్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు…ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవాలి ఆయన రేంజ్ ఏ విధంగా ఉందో..అందుకే కావొచ్చు ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో కోహ్లీ , ప్రభాస్ లకంటే విజయ్ టాప్ లో ఉన్నాడు.

టైమ్స్ గ్రూప్ ఏటా నిర్వహించే ‘ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్’ సర్వేలో భాగంగా 2018 సంవత్సరానికి సంబందించిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి టాప్ 10లో స్థానం సంపాదించిన ఏకైక హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. విజయ్ నాలుగో స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అంతేకాదు, ఈ టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో తొలిసారి స్థానం సంపాదించుకున్నారు.ఇక బాహుబలి ప్రభాస్ ఈ జాబితాలో 12వ స్థానంలో ఉండడం అందరిని షాక్ కు గురి చేసింది.

ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తో జులై 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.