విజయ్ ఏంటి ఈ అరాచకం..

విజయ్ దేవరకొండ అరాచకం రోజు రోజుకు పెరిగిపోతుంది..అరాచకం అనగానే తప్పుగా అనుకోకండి..మీము చెప్పేది ఆయన పాపులార్టీ గురించి. పెళ్లి చూపులు సినిమా టైం కు ఇప్పటికి విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు..చిన్న వయసు నుండి పెద్ద వారు వరకు అందరు విజయ్ కు వీరాభిమానులు అవుతున్నారు. ముఖ్యం యూత్ అయితే విజయ్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంటున్నారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు దేశ వ్యాప్తంగా విజయ్ క్రేజ్ బాగా పెరిగింది.

విజ‌య్ దెబ్బ‌కు విరాట్ కోహ్లీ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా త‌ల వంచేసారంటే ఆయ‌న క్రేజ్ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్కో సినిమాతో త‌న మార్కెట్ భారీగా పెంచేసుకుంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక ఇప్పుడు ఈయ‌న ఇమేజ్‌కు మ‌రో నిద‌ర్శ‌నం మోస్ట్ డిజైర‌బుల్ మెన్ ఆఫ్ 2018 లిస్టులో 4వ స్థానం ద‌క్కించుకోవ‌డ‌మే. మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌కు క‌నీసం ద‌క్క‌ని అవ‌కాశం విజ‌య్ దేవ‌ర‌కొండకు వచ్చిందంటే అది మాములు విషయం కాదు.

ఇక తెలుగులో ఈయ‌న త‌ర్వాత స్థానం ప్ర‌భాస్ సొంతం చేసుకున్నాడు. విజ‌య్ 4వ స్థానంతో సంచ‌ల‌నం సృష్టిస్తే.. 12వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు ప్ర‌భాస్. ఇక సౌత్ నుంచి 9వ స్థానంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ఉన్నాడు. 14వ స్థానంలో కేజియ‌ఫ్ స్టార్ య‌శ్.. 38వ స్థానంలో ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాలి ఉన్నారు.