విజయ్ కి గాయాలు..కారణం ఎవరో తెలుసా..?

‘ఇళయ దళపతి’ విజయ్ కు తమిళనాట ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. విజయ్ నుండి సినిమా వస్తుందంటే ఓ పెద్ద పండగల భావిస్తారు. రిలీజ్ కు రెండు మూడు రోజుల నుండే థియేటర్స్ ను అలంకరించడం , భారీ కటౌట్స్ ఏర్పటు చేయడం వంటివి చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.

తాజాగా ఇప్పుడు అభిమానమే విజయ్ ను గాయాలపాలు చేసింది. తాజాగా విజయ్ అఖిల భారత అభిమాన సంఘం అధ్యక్షుడు – పాండిచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూతురు వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకకు విజయ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. విజయ్ శుక్రవారం సాయంత్రం తన సతీమణి సంగీతతో కలిసి పెళ్లికి హాజరయ్యారు. కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. బౌన్సర్లు అడ్డుకున్నా అభిమానులు ఆగలేదు. ఈ తోపులాటలో విజయ్ కింద కూడా పడిపోయాడు. కాలికి దెబ్బ తగిలింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేసి విజయ్ దంపతులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.