ఇంట్లో కొడుకు.. సెట్స్ లో బాస్ !

దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కలిసి అద్భుతాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలకి ఆయన తండ్రియే కథని అందిస్తుంటారు. ఇద్దరు కలిసి స్క్రిప్టుని పూర్తి చేస్తారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన కుమారుడు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని అసలు ఊహించలేదు. తాను రాజమౌళి పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు.

తాము ఇంట్లో ఒకలా, సెట్స్ లో మరోలా ఉంటాం. ఇంట్లో తండ్రిగా నాదే ఆధిపత్యం. సెట్స్ లో మాత్రం అతడే బాస్. నేను రచయితని మాత్రమే. రాజమౌళితో కథని అద్భుతంగా చెప్పగలిగే నైపుణ్యం ఉంది. దర్శకుడు కాకముందు నుంచే నాకు కథ విషయంలో రాజమౌళి సాయం చేసేవాడు. అలా దర్శకత్వ నైపుణ్యాలు పెంచుకున్నాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.