శర్వాతో విక్రమ్ కుమార్ ?

13 బి, ఇష్క్‌, మ‌నం, 24…. ఇలా ఒక క‌థ‌కీ మ‌రో క‌థ‌కీ లింకు లేకుండా సినిమాలు తీశాడు విక్రమ్ కె.కుమార్‌. అక్కినేని మూడు త‌రాల హీరోల్ని ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చిన మ‌నం సినిమా అయితే ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. , ఇటివలే అఖిల్ తో హలో తీశాడు.

హలో తరువాత విక్రమ్ కుమార్ నానితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం మేరకు శర్వానంద్ విక్రమ్ కుమార్ మూవీ ఉండొచ్చని సమాచారం . వైజయంతి మూవీస్ సంస్థలో విక్రమ్ కుమార్ ఈ సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై ప్రకటన రానుంది.