‘వివిఆర్’.. ట్రెడింగ్’లో టాప్ !

ఎప్పుడు ఎక్కడ చూసిన రాముడు కబుర్లే. వినయ విధేయ రాముడు గురించే చెప్పుకొంటున్నారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. ట్రెడింగ్ లోనూ టాప్ లో ఉన్నాడు వినయ విధేయ రాముడు. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ ని రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇక ‘వివిఆర్’పై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. ఇది పక్కా బోయపాటి మార్క్ సినిమా. సినిమాలో యాక్షన్ హైలైట్ గా ఉంది. ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్ లో చరణ్ ఇరగదీశాడని చెప్పుకొంటున్నారు. ఐతే, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోకపోవచ్చని చెబుతున్నారు. మెగా, బోయపాటి అభిమానులు మాత్రం సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. హై వోల్టేజ్ సినిమాలకి ఇలాంటి టాక్ సహజమే. అయినా.. వివిఆర్ కమర్షియల్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.