విశాల్ మరో సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్..

తమిళ్ హీరో విశాల్ ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఇరుంబు తిరై(అభిమన్యుడు) చిత్ర సీక్వెల్ కు ఓకే చెప్పిన విశాల్..మిస్కిన్ డైరెక్షన్ లో తుప్పరివలాన్ (డిటెక్టీవ్) చిత్ర సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2017 లో వచ్చిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం విశాల్ సుందర్ సీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. టర్కీ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుంది. ఇక సెట్ లోనే మిస్కిన్ , విశాల్ ను కలిసి తుప్పరివలాన్ 2 స్క్రిప్ట్ వినిపించాడట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే విశాల్ సినిమాకు ఓకే చెప్పాడట. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం మొదలు కానుందని అంటున్నారు.

ఇక విశాల్ పర్సనల్ విషయానికి వస్తే..ఈ మధ్యనే విశాల్ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. హైదారాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అనీశా రెడ్డిని ప్రేమించిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కి ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.