విశాల్ కు జోడిగా జెర్సీ బ్యూటీ..

జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రద్ధ శ్రీనాథ్‌..తాజాగా విశాల్ కు జోడిగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. నూతన డైరెక్టర్ ఆనంద్‌ డైరెక్షన్లో విశాల్ చేయబోయే చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ద శ్రీనాధ్ ను ఎంపిక చేసారు.

థ్రిల్లర్‌ కథాంశంతో తెరేకేక్కబోయే ఈ చిత్రంలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శ్రద్ధ పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.