‘ఓటర్’ టీజర్ టాక్


హీరో మంచు విష్ణు కూడా పాలిటిక్స్ పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఓటరు’ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ నిర్మిస్తున్నారు. మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ప్రస్తుతం ఎన్నికల కాలం నేపథ్యంలో ‘ఓటర్’ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.

అది ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్స్ కి తీసుకొస్తుందనేది చూడాలి. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగా టీజర్ లోనూ పొలిటికల్ విషయాలని ప్రస్తావించారు. సమాజంలో మార్పురావాలంటే.. రాజకీయ నేతలని మార్చాలని మంచు విష్ణు చెప్పడం టీజర్ లో చూపించడం విశేషం. ‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ, పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి’ భారీ డైలాగులు చెప్పాడు. ఓటర్ టీజర్ ని మీరు చూసేయండీ.. !