క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ ఖాతాలో !

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడారు. ‘వినయ విధేయ రామ’లో హీరో తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడని తెలిపారు. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ చరణ్‌ అన్నయ్యలుగా కనిపిస్తారు. వదిన పాత్రల్లో స్నేహ, హిమజ, ప్రవీణ నటించారు. సినిమాలో యాక్షన్‌ దృశ్యాలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా అజర్‌బైజాన్‌ లోని తెరకెక్కించిన పోరాట ఘట్టం అభిమానుల్ని మైమరిపిస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అన్నీ రామ్‌ చరణ్‌ అంటూ పూర్తి క్రెడిట్ ఆయన ఖాతాలోనే వేశాడు బోయపాటి.