పబ్లిక్ టాక్ : వినయ విధేయ రామ

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. కైరా అద్వానీ హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహా.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంచారు. డివివి దానయ్య నిర్మాత. భారీ అంచనాల మధ్య ‘వివిఆర్’ సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. మరీ.. సినిమాపై పబ్లిక్ టాక్ ఏంటో చూద్దాం పదండీ.. !

కథని రిలీవ్ చేయకుండా సింపుల్ గా చెప్పాలంటే.. ఇదో కుటుంబ కథ. అన్నదమ్ములలో ఒకరి కి వచ్చిన సమస్య కి హిరో ఎదురు నిలవడం అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. ఐతే, ఇది కేవలం మాస్ అభిమానులకు మాత్రమే నచ్చే యావరేజ్ చిత్రమని అంటున్నారు. యాక్షన్ సీన్స్ మోతాదుకి మించి ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇబ్బంది పెట్టాయని చెబుతున్నారు.

ఫస్టాఫ్ బాగుంది. ఫస్టాఫ్ రేంజ్ లో సెకండాఫ్ లేదని చెబుతున్నారు. చరణ్ నటన, ఫైట్స్, డ్యాన్స్ అదిరిపోయాయట. ఒక్కమాటలో చెప్పాలంటే చరణ్ వన్ మేన్ షో అంటున్నారు. బోయపాటి మాత్రం బలహీనమైన కథ.. అనవసర బిల్డప్ సన్నివేశాలని రాసుకొన్నారని చెప్పుకొంటున్నారు. మొత్తంగా. వివిఆర్ పై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. ఐతే, గతంలో బోయపాటి సినిమాలు మిక్సిడ్ టాక్ అందుకొని.. హిటైన సినిమాలున్నాయి.