‘యాత్ర’ డిజిటల్ రైట్స్ రేటెంతో తెలుసా ?

దివంగత నేత వైఎస్ఆర్ పాద’యాత్ర’ తెరపై కూడా హిట్టయింది. మహి. వి రాఘవ దర్శకత్వంలో వైఎస్ఆర్ బయోపిక్ గా ‘యాత్ర’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యాత్ర’ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలావుంటే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ తీసుకుంది. సుమారు రూ. 8 కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడిపోయినట్టు తెలుస్తోంది.

ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాలేదు. హిందీ డబ్బింగ్ బేరాలు సాగుతున్నాయి. మరోవైపు, థియేటర్స్ లో ‘యాత్ర’ మంచి కలెక్షన్స్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యాత్ర సేఫ్ జోన్ లోకి అడుగుపెట్టేసింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసుకొన్న యాత్ర నిర్మాతలకి లాభాలు తీసుకొచ్చేలా కనబడుతోంది. ఇప్పట్లో పెద్ద సినిమాలేవీ లేవు. ఈ వారం విడుదలకాబోతున్న రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే. దీంతో యాత్ర జోరుకు ఈ వారం బ్రేకులు పడే ఛాన్స్ లేదు. ఇది కలిసొచ్చే విషయం అని చెప్పాలి.