బాలయ్యని కాదంటున్న హీరోయిన్లు !

rejina (4)

సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102 చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలయ్య సరసన నయనతార జతకట్టనుంది. ఈ సినిమా కోసం రెడ్డిగారు, జయసింహా, కర్ణ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర నివిడి చిన్నదే అయినా.. కీలకం కావడంతో మరో హీరోయిన్ ని తీసుకోవాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

pragya

ఇప్పటికే యంగ్ హీరోయిన్ రెజీనాని సంప్రదించారట. ఆమె కాదనడంతో.. ప్రగ్యా జైశ్వాల్ ని కూడా టచ్ చేశారట. ఆమె కూడా నో చెప్పినట్టు తెలుస్తోంది. పాత్ర నివిడి చిన్నదే కావడంతో వీరిద్దరు నో చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్యకే నో చెబితే.. మిగితా సీనియర్ హీరోల పరిస్థితి ఏంటని ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. బాలయ్య 102 సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.