రెండు రోజుల ముందే ఫ్యాన్స్ పండగను తెచ్చిన షారుఖ్..


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్..ప్రస్తుతం జీరో మూవీ చేస్తున్నాడు. డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో షారూఖ్ మరుగుజ్జుగా కనిపిస్తుండగా , అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. తాజాగా ఈద్ సందర్భాంగా సరికొత్త టీజర్ ను రిలీజ్ చేసి , అభిమానులకు పండగా వాతావరణాన్ని రెండు రోజుల ముందే తెచ్చారు.

టీజర్ విషయానికి వస్తే..షారూక్‌, సల్మాన్‌ లు కలిసి ఆడిపాడిన టీజర్‌ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. ఈద్‌ సందర్భంగా ఇద్దరు సోదరులు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటూ టీజర్‌ను ముగించారు. ముఖ్యంగా మరుగుజ్జుగా కనిపిస్తున్న షారూఖ్‌ను ఎత్తుకోవటం, షారూఖ్‌ ప్రేమగా సల్మాన్‌కు ముద్దుపెట్టడం టీజర్‌లో హైలెట్ గా నిలుస్తుంది.

ఈ మూవీ లో కత్రినా సూపర్ స్టార్ పాత్ర పోషిస్తుండగా , ఆమె ప్రేమను గెలుచుకోవాలని షారుక్ ప్రయత్నిస్తుంటారు. మరోపక్క అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో కన్పించనున్నారు. షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు.