రివ్యూ : ఏబీసీడీ


చిత్రం : ఏబీసీడీ (2019)

నటీనటులు : అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు త‌దితరులు

సంగీతం : జుదా సాందీ

దర్శకత్వం : సంజీవ్ రెడ్డి

నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని

రిలీజ్ డేటు : 17మే, 2019.

రేటింగ్ : 2.25/5

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో అల్లు శిరీష్ హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత శిరీష్ నటించిన ‘క్షణం’ చిత్రం నిరాశపరిచింది. ‘ఎక్కడికిపోతావు చిన్నినాయన’ లాంటి హిట్ తర్వాత వి. ఐ ఆనంద్ చేసిన చిత్రమిది. సినిమాకు మంచి టాక్ వచ్చినా.. కమర్షియల్ గా ఆడలేదు. మలయాళ రిమేక్ ‘ఏబీసీడీ’పై శిరీష్ మనసుపడ్డాడు. తన దగ్గరికి మరో కథతో వచ్చిన దర్శకుడు సంజీవ్ రెడ్డితో ఏబీసీడీ రిమేక్ చేశారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఏబీసీడీ శిరీష్ కి హిట్ ఇచ్చిందా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
అర‌వింద ప్ర‌సాద్‌ (అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియ‌న్‌. జీవితంలో విలాసాలు తప్ప మరోకటి తెలియవు. జీవితంలో లక్ష్యం, బాధ్యతలు తెలుసుకోకుండా తిరిగే అభిని దారిలో పెట్టాలని తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకు పంపిస్తాడు. డబ్బును దుబారాగా ఖర్చు చేసే అభికి పైసలు ఇవ్వకుండా బతకమని సూచిస్తాడు. ఆ క్రమంలో నేహా (రుక్షర్)‌తో ప్రేమలో పడుతాడు ? జీవితం ఏంటో తెలుసుకొనే పరిస్థితుల్లో తాను నివసించే మురికివాడకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి యువ రాజకీయ నేతను ఎదురించాల్సి వస్తుంది. ఫైనల్ గా అవికి జీవితం, డబ్బు విలువ తెలిసిందా.. ? నేహాతో ప్రేమ ఏమైంది.. ?? అన్నది మిగితా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

* అల్లు శిరీష్, భరత్ నటన

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* స్లో నేరేషన్

* కామెడీ, ఎమోషన్

 

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

కథని చాలా జాలిగా స్టార్ట్ చేశాడు దర్శకుడు. అవి విలాసాలు, ఎంజాయ్ చేస్తూ బతికి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. అవి ప్రేక్షకులని కిక్కునిచ్చేలా సాగలేదు. రొటీన్ గా అనిపించాయ్. అవి ఇండియాకు వచ్చిన సన్నివేశాలతో ఎమోషన్స్ ని టచ్ చేయొచ్చు. కానీ, ఆ రేంజ్ లో సీన్లు పండలేదు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అభి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాల్లో డెప్త్ కనిపించలేదు.

ఇక సెకాంఢాఫ్ లో కథలోకి పొలిటికల్ అంశాలు చేరాయి. అవి రొటీన్ గానే ఉన్నాయి. అల్లు శిరీష్ నటన బాగుంది. చాలా ఈజీగా నటించేశారు. రుక్షర్‌తో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాయి. సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీ, భరత్ హాస్యం ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తాయి. తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

జుడా శాండీ అందించిన రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సిద్ శ్రీరామ్ పాడిన మెల్ల మెల్లగా పాట సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఈ పాటకు కృష్ణకాంత్ రాసిన సాహిత్యం బాగుంది. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఏమీ లేదు. ఎడిటింగ్ షార్ప్ గా లేదు. సినిమాలో చాలా బోరింగ్ సన్నివేశాలున్నాయి.

చివరగా :

‘ఏబీసీడీ’ చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు. కాకపోతే.. యూత్ కి కనెక్ట్ అయ్యే కొన్ని సీన్లు ఉన్నాయి. అవే సినిమాని రక్షించాలి. బీ, సీ సెంటర్లలో సినిమాకు లభించే ఆదరణని బట్టీ.. సినిమా ఫలితాన్ని చెప్పవచ్చు.

రేటింగ్ : 2.25/5