రివ్యూ : చిత్రలహరి


చిత్రం : చిత్రలహరి (2019)

నటీనటులు : సాయి తేజ్‌, కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌, సునీల్ తదితరులు

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌

దర్శకత్వం : కిషోర్‌ తిరుమల

నిర్మాత : రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి

రిలీజ్ డేటు : 12 ఏప్రిల్, 2018.

రేటింగ్ : 2.75/5

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులని అలరించాడు. ఈ క్రమంలో ఒకట్రెండు విజయాలు అందుకొన్నాడు. ఆ తర్వాత తేజు రొటీన్ మాస్-యాక్షన్ ప్రేక్షకులకి బోర్ కొట్టింది. ఫలితంగా తేజు వరసగా ఆరు ప్లాపులు పడ్డాయి. వీటి నుంచి బయటపడేందుకు తేజు దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. వీరి కలయికలో తెరకెక్కిన చిత్రలహరి.
కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ . సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య చిత్రలహరి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉంది ? తేజుకి హిట్ దక్కినట్టేనా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్) జీవితంలో సక్సెస్ అంటే ఏంటో తెలియని కుర్రాడు. నలుదిక్కుల సూర్యుడు ఉదయించినా జీవితంలో వెలుతురు కానరని యువకుడు. అలాంటి యువకుడు సక్సెస్ కోసం ఓ ప్రాజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు, రెండు లవ్ స్టోరీలు లహరి (కల్యాణి ప్రియదర్శన్), స్వేచ్ఛ (నివేతా) లతో బ్రేకప్. విజయ్ లవ్ ఫెల్యూర్స్ కి కారణాలేంటీ ? డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయడానికి విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు తన సక్సెస్ కోసం ఎలాంటి సాహాసానికి సిద్ధపడ్డాడు. చివరికి అది దక్కిందా.. ? అన్నది చిత్రలహరి కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ

* సాయి తేజు నటన

* డైలాగ్స్

* సునీల్, వెన్నెల కిషోర్ ల కామెడీ

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

సక్సెస్, ఫెయిల్యూర్, లవ్, ఫ్యామిలీ రిలేషన్స్, కామెడీ అంశాలను కలిపి ‘చిత్రలహరి’ కథని రెడీ చేసుకొన్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. బలమైన సన్నివేశాలు, వాటికి తోడు ఆలోచింపజేసే డైలాగ్స్ సినిమాకు బలంగా నిలిచాయి. విజయ్ కృష్ణ పాత్రలో సాయిధరమ్ తేజ్ ఒదిగిపోయాడు. సమాజంలో ప్రతీ యువకుడిని టచ్ చేసే విధంగా ఆయన్ని పాత్రని తీర్చిదిద్దాడు దర్శకుడు. తేజు సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ తో ఆకట్టుకొన్నాడు. ఆయన వందకి వంద మార్కులు పడతాయి.

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటన బాగుంది. భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడే ప్రేమికురాలి పాత్రలో బాగానే నటించింది. డబ్బింగ్ విషయంలో కాస్త తడబాటు కనిపించింది. మరో హీరోయిన్ నివేథా పేతురాజ్ కార్పోరేట్ ఉమెన్ గా కనిపించింది. తల్లిదండ్రులకు ప్రేమకు దూరమైన యువతి పాత్రలో ఆమె చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. చానాళ్ల తర్వాత సునీల్ కి మంచి పాత్ర దక్కింది. తన మార్క్ కామెడీతో ఆకట్టుకొన్నాడు. వెన్నల కిషోర్ సెకాంఢాఫ్ లో నవ్వులు పంచాడు.

సాంకేతికంగా :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఇటీవల కాలంలో దేవి అందించిన చిత్రాల్లో ఇదే బెస్ట్. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాఫ్ లో సినిమా స్లోగా సాగింది. కొన్ని సన్నివేశాలకి కత్తెర పెట్టొచ్చు. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

‘చిత్రలహరి’ మాటలు బాగున్నాయి. కథ కూడా అందరికీ కనెక్ట్ అయ్యే కథ. తేజు నటన, సునీల్, వెన్నెల కిషోర్ ల కామెడీ హైలైట్ గా నిలిచాయి. మొత్తంగా చిత్రలహరి తప్పక చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 2.75/5