రివ్యూ : గాయత్రి

చిత్రం : గాయత్రి (2018)
నటీనటులు : మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ శరణ్, నిఖిలా విమ‌ల్
సంగీతం : థ‌మ‌న్
దర్శకత్వం : మదన్
నిర్మాత : మోహన్ బాబు
రిలీజ్ డేటు : 09 ఫిబ్రవరి, 2018.
రేటింగ్ : 2.5/5

చాన్నాళ్ల తర్వాత డైలాగ్ కింగ్ మోహన్ బాబు నుంచి ఓ సినిమా వచ్చేసింది. అదే ‘గాయత్రి’. మదన్ దర్శకుడు. మంచు విష్ణు, శ్రియ శరణ, నిఖిలా విమలా కీలక పాత్రలో నటించారు. కొద్దిరోజులుగా ‘గాయత్రి’ టీజర్, ట్రైలర్స్ లోని డైలాగ్స్ బుల్లితెరపై హల్ చల్ చేస్తున్నాయి. మోహన్ బాబు మార్క్ డైలాగులు ప్రేక్షకులని థియేటర్స్ కు రమ్మని పిలుస్తున్నాయి. ఈరోజు ప్రేక్షకులు ‘గాయత్రి’ కోసం థియేటర్స్ కు వెళ్లారు. మరీ.. ‘గాయత్రి’ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
శివాజీ (మంచు విష్ణు, మోహ‌న్ బాబు) స్టేజీ ఆర్టిస్ట్. అతడి నటనని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది శారద (శ్రియ). వీరిద్దరు కలిసి కొత్త కాపురం పెడతారు. ఆ సమయంలో శార‌ద అనారోగ్యం పాల‌వుతుంది. వైద్య ఖ‌ర్చుల కోసం రూ. ల‌క్ష అవ‌స‌రం అవుతాయి. దీంతో.. డబ్బుల కోసం ఒక నేర‌స్థుడి స్థానం జైలుకి వెళ‌తాడు శివాజీ. జైలు నుంచి విడుదలైన శివాజీ భార్య చనిపోయిందనే షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. తన కూతురిని అనాథ ఆశ్రమంలో చేర్పించారని తెలుసుకొంటాడు. అప్పటి నుంచి చేయని తప్పులని తన మీద వేసుకొంటూ జైలుకు వెళుతూ.. ఆ డబ్బుని అనాథాశ్రమాల కోసం ఇస్తుంటాడు.

శివాజీ ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం వ‌చ్చిన ఇన్వెస్టిగేష‌న్ రిపోర్ట‌ర్ శ్రేష్ట‌ (అనసూయ‌) అతడి గతాన్ని తవ్వుతోంది. ఈ క్రమంలో ఆమెకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అచ్చం శివాజీ పోలికలతో గాయ‌త్రి ప‌టేల్ అనే డాన్ ఉన్నాడనే విషయాన్ని శ్రేష్ట కనిపెడుతోంది. ఇంతకీ శివాజీ, గాయత్రికి పటేల్ కు మధ్య సంబంధం ఏమిటి ? చివరికి శివాజీ కూతురు దిరికిందా ? లేదా.. ?? అనేది మిగితా కథ.

ఎవరెలా చేశారంటే ?
సరైన కథ పడాలే గానీ డైలాగ్ కింగ్ మోహన్ బాబు రెచ్చిపోతాడు. గాయత్రి పటేల్ గా మోహన్ బాబుకు అదే దొరికింది. దీంతో తనదైన నటన, డైలాగ్స్ తో అదరగొట్టాడు. దర్శకుడు మదన్ కూడా మోహన్ పాత్రలని అద్భుతంగా రాసుకొన్నాడు. శివాజీ, గాయత్రి పటేల్ పాత్రల్లో మోహన్ బాబు నటన సినిమాకే హైలైట్. ఐతే, మిగితా అంశాలని కథకు లింకు చేయడంలో వైఫల్యం కనిపించింది.

1990ల నాటి కథాంశం తీసుకోవడం తో పాటు, కథన శైలిని కూడా అలానే కొనసాగించారు. మోహన్ బాబు డైలాగులు బాగున్నాయి. పాత కథకి ప్రస్తుతం ఉన్న రాజకీయ సంఘటనలని అల్లుకోవడం వల్ల ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. మోహన్ బాబు నోటి నుంచి వచ్చిన పొలిటికల్ డైలాగ్స్ కు థియేటర్స్ విజల్స్ పడ్డాయి. ఏపీ ప్రత్యేక హోదాపై ఓ డైలాగ్ ఉంది. ఐతే, సెన్సార్ బోర్డ్ సూచన మేరకు ఆ డైలాగ్ మ్యూట్ చేశారు.

మోహన్ బాబు పాత్ర తర్వాత మంచు విష్ణు, శ్రియల పాత్రలు ఆకట్టుకొంటాయి. వీరు తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా నటనతో ఆకట్టుకొన్నారు. ఇన్వెస్టిగేష‌న్ రిపోర్ట‌ర్ పాత్ర అనసూయ‌కు ఫర్ ఫెక్ట్ గా సూటయ్యింది. బ్రహ్మానందం ఉన్న ఆయన రేంజ్ లో నవ్వులు పూయలేదు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :
కుటుంబ కథా చిత్రాలని సున్నితంగా తెరకెక్కించే దర్శకుడు మదన్. ఐతే, ఆయన తొలిసారి యాక్షన్ ఎంటర్ టైనర్ ని డీల్ చేశారు. అందులో కొద్ది వరకు సక్సెస్ అయ్యారు కూడా. థమన్ అందించిన సంగీత, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్ చాలా ఫాస్ట్ గా సాగినా, సెకాంఢాఫ్ సినిమా నెమ్మదించింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటామ్ లైన్ : ‘గాయత్రి‘.. మోహన్ బాబు వన్ మేన్ షో.