రివ్యూ : కాంచన 3

చిత్రం : కాంచన 3

న‌టీన‌టులు : రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

సంగీతం – థమన్

ద‌ర్శ‌కత్వం – రాఘ‌వ లారెన్స్‌

విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2019.

రేటింగ్ : 2.25/5

రాఘవ లారెన్స్ హిట్ సిరీస్ కాంచన. కాంచన, కాంచన 2 చిత్రాల్లో నవ్విస్తూనే భయపెట్టాడు. అది ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఫలితంగా ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో వస్తోన్న మూడో చిత్రం కాంచన 3. మిగితా రెండు సినిమాలతో పోలిస్తే ఇందులో యాక్షన్, గ్లామర్ డోస్ పెంచినట్టు అనిపించింది. అది కలిసొచ్చిందా.. ? మూడో కాంచన ఏ రేంజ్ లో నవ్వించింది. భయపెట్టింది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఊర్లో రాఘవ (లారెన్స్) తాతయ్య షష్ఠిపూర్తి. ఈ వేడుక కోసం రాఘవ కుటుంబం మొత్తం సిటీ నుంచి ఊరెళుతుంది. ఈ వేడుకకి రాఘవ మరదళ్లు ఓవియా, వేదిక, నిక్కి తంబోలి కూడా వస్తారు. దీంతో చాలా సరదాగా ఉంటుందని రాఘవ ఆశపడతాడు. ఇంతలో ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు తెలుస్తోంది. అఘోరాలను ఆశ్రయిస్తారు. ఆ ఘోరా దెయ్యం ఉన్న ఇంటికి వచ్చి.. వాటిని తరిమేశానని అబద్దం చెప్పి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లాక దెయ్యాలు రాఘవ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంతకీ.. కాళి, జూలియా ఎవరు ? రాఘవని ఎందుకు ఆవహిస్తాయి. ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాయి అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* లారెన్స్ నటన

* బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* విలన్ రోల్

* ఎడిటింగ్

* పాత్రల ఓవర్ యాక్షన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

మూడో కాంచన రొటీన్ నేరేషన్ తో సాగింది. ఫస్టాఫ్ లో రాఘవ కుటుంబం, మరదళ్లతో సరదాలతో సాగింది. రాఘవ శరీరంలోకి కాళి, జూలియా అనే దెయ్యాలు చేరే సీన్ తో ఇంటర్వేల్ పడింది. ఆ తర్వాత దెయ్యాలకి జరిగిన అన్యాయం ఏంటీ ? పగ తీర్చుకునే ఎపిసోడ్స్ లో భయపెట్టే ప్రయత్నం జరిగింది. ఇందులోనూ లారెన్స్ దెయ్యం అంటే భయపడి అమ్మ చంకెక్కడం చూపించారు. కాళి పాత్రలో మాత్రం మాస్ లుక్‌తో, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

ఓవియా, వేదిక, నిక్కి తంబోలి ఒక్కరికి నటించే స్కోప్ దొరకలేదు. ముగ్గురు గ్లామర్ షోకే పరిమితం అయ్యారు. వీరిలో వేదిక కాస్త డోస్ పెంచింది. రాఘవ తల్లి పాత్రలో కోవై సరళ, అన్న వదినల పాత్రల్లో శ్రీమాన్, దేవదర్శిన వారి పాత్రలకు న్యాయం చేశాడు. విలన్ పాత్రల్లో కబీర్ దుహన్ సింగ్ తేలిపోయాడు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

ఈ మధ్య థమన్ నేపథ్య సంగీతంతో మేజిక్ చేస్తున్నారు. ఐతే, మూడో కాంచనలో ఆ రేంజ్ కనబడలేదు. వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో పాత్రల ఓవర్ యాక్షన్ ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టేలా ఉంది. ఆ గోల తప్పాలంటే.. చాలా సీన్స్ కి కత్తెరపెట్టాల్సి ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఒకటి, రెండో కాంచనలో ఉన్న మేటరు మూడో కాంచనలో లేదు. కాకపోతే.. మూడో కాంచనలో గ్లామర్ డోస్ ఎక్కువ. దాంతో పాటు ఓవర్ యాక్షన్ ఎక్కువే. జెర్నీ లాంటి స్టయిట్ తెలుగు సినిమాని వదిలిపెట్టి.. కాంచన 3 థియేటర్స్ కి వెళ్లడం సాహాసమే అని చెప్పవచ్చు.

రేటింగ్ : 2.25/5