రివ్యూ : ఖైదీ నెం.150

khaidi no.150 revew
టైటిల్ : ఖైదీ నెం.150 (2017)
స్టార్ కాస్ట్ :చిరంజీవి, కాజల్, తరుణ్ అరోరా
మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్
డైరెక్టర్ : వివి. వినాయక్
ప్రొడ్యూసర్స్ : రామ్ చరణ్
విడుదల తేది : జనవరి11, 2017

బాస్ ఈ జ్ బ్యాక్. థియేటర్స్ లో సందడి చేయడం కూడా మొదలెట్టాడు. కానీ, బాసు లో గ్రేసు ఏమాత్రం తగ్గలేదు. అదే ఊపు, అదిరిపోయే స్టయిల్, చురకత్తెలాంటి చూపు, క్లాసు, మాసు ప్రేక్షకుల చేత మళ్లీ జేజేలు కొట్టించుకొంటున్నాడు. 9యేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినా.. అదే స్వీడు, అదే జోరు. సంక్రాంతి పండగ వేళ అభిమానులకి విందు భోజనం పెట్టేశాడు. మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

వివి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’లో చిరు సరసన కాజల్ జతకట్టింది. లక్ష్మీరాయ్ ఐటమ్ సాంగ్ లో మెరసింది. మెగాయంగ్ హీరోలు రామ్ చరన్, అల్లు అర్జున్ సప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు వినాయక్ కూడా ఠాగూర్ మాదిరిగా ఓ చిన్ని పాత్రలో కనిపించి తన సెంటిమెంట్ ని రిపీట్ చేశాడు.

రిలీజ్ కి ముందే మెగా ఖైదీపై ‘కబాలి’ రేంజ్ క్రేజ్ నెలకొంది. కొన్ని కార్పోరేట్ కంపెనీలు మెగా ఖైదీ కోసం సెలవులు కూడా ప్రకటించాయి. ముఖ్యంగా మెగాస్టార్ ఏం చేస్తాడు.. ? ఇప్పటికే పొలిటిక్స్ చిరుకి కలసి రాలేదు. అయితే, సినీ పరిశ్రమలో మాత్రం చిరు మెగాస్టార్. మరీ.. 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న చిరు ఆ రేంజ్ లో ప్రేక్షకులని అలరిస్తాడా.. ?? అన్నది ఆసక్తిగా మారింది. దీనికి తోడు మెగా అభిమానులు మెగా ఖైదీని ప్రెస్టేజిగా తీసుకొన్నారు. బాలయ్య ‘శాతకర్ణి’తో ఢీకొంటేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పరిస్థితులు కాస్త హీటెక్కాయి.

ఇలాంటి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ ఖైదీ నెం.150 ప్రేక్షలని ఏ మేరకు ఆకట్టుకొంది. అసలు మెగాఖైదీ కథేంటీ.. ?? వివిధ వెబ్ సైట్స్ మెగా ఖైదీకి ఇచ్చిన రేంటింగ్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండీ.. !

Website Rating Tag Line
telugumirchi 3.75/5 ఫ్యాన్స్ కు ఫుల్ భోజనమే..
123telugu 3.25/5 అభిమానులకు చిరంజీవి ఇచ్చిన కానుక !
Gulte 3/5 Boss is back with New Innings
apherald 3/5 మెగా ఫ్యాన్స్ కు పసందైన విందు..!
greatandhra 3/5 మెగాస్టార్‌ కొత్త అధ్యాయం షురూ!
Tupaki 3/5 మెగాస్టార్ మేనియా
filmibeat 3/5 రక్త సింధూరం
tsmirchi 3.5/5 Full meal for Mega Fans
mirchi9 3.5/5 Boss One Man Show
telugu360 3.5/5 Megastar Returns in Style!
bollywoodlife 3/5 Chiranjeevi aka Boss is back and he’s killing it
deccanreport 3/5
pressks 4/5 Boss is Back with a Blockbuster Film
లేటెస్ట్ గాసిప్స్