రివ్యూ : మజిలీ


చిత్రం : మజిలీ (2019)

నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యంశ కౌశిక్ తదితరులు

సంగీతం : గోపి సుందర్, థమన్

దర్శకత్వం : శివ నిర్వాణ

నిర్మాతలు : హరీష్ పెద్ది, సాహు గారపాటి

రిలీజ్ డేటు : 05 ఏప్రిల్, 2019.

రేటింగ్ : 3.25/5

‘ఏం మాయ చేశావె’ సినిమాతో నాగచైతన్య-సమంత ప్రేక్షకులని తొలిసారి మాయ చేశారు. ‘మనం’ సినిమాతో రెండోసారి ప్రేక్షకులని మాయ చేశారు. ఇక పెళ్లి తర్వాత చై-సామ్ తొలిసారి జతకట్టిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సమంత పాటు.. ఈసారి చైతూ నటనతో షాక్ ఇచ్చేలా కనబడ్డాడు. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన మజిలీ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కుర్రాడు పూర్ణ (నాగ చైతన్య). ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే అన్షు (దివ్యాన్ష కౌశిక్)తో ప్రేమలో పడతాడు. అనుకోని పరిణామాల వలన పూర్ణ ప్రేమ విఫలవుతుంది. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి.. తాగుబోతులా తయారవుతాడు. అలా డిప్రెషన్ లో ఉండగానే కుటుంబ సభ్యుల ఒత్తిడిలో శ్రావణి (సమంత)తో పెళ్లి జరుగుతుంది. ప్రేయసిని మర్చిపోలేక భార్యతో సరిగా కాపురం చేయలేక పూర్ణ ఎలాంటి మానసిక క్షోభ అనుభవించాడు. భర్త కోసం భార్యగా శ్రావణి పడిన తపన, ప్రేమతో కూడిన ఎమోషనల్ జర్నీ మజిలీ కథ.

ప్లస్ పాయింట్స్ :

* సమంత, నాగ చైతన్యల నటన

* భాగోద్వేగాలు

* కథ-కథనం

* నేపథ్య సంగీతం

* క్లైమాక్స్

* దివ్యంశ కౌశిక్ గ్లామర్

మైనస్ పాయింట్స్ :

* కొన్ని చోట్ల స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు శివ నిర్వాణ బలమైన కథని రాసుకొన్నాడు. ఆ కథకి భాగోద్వేగాలని జతకచేసి తెరపై అద్భుతంగా చూపించాడు. పూర్ణ-అన్షు టీనేజ్ ప్రేమకథ. వీళ్ల మధ్య రొమాన్స్ యూత్ ఆకట్టుకొనేలా ఉంది. లవ్ ఫెల్యూర్ కుర్రాడిగా చైతూ బోల్డ్ నటనతో ఆకట్టుకొంటాడు. కండోమ్ ఉందా ? అని అడగటం ‘అర్జున్ రెడ్డి’ సినిమాని తలపిస్తాయి.

యాంగ్రీ యాటిట్యూడ్, లవ్ ఫెయిల్యూర్ గా అద్భుతంగా నటించాడు చైతూ. చై-సామ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగా కుదిరాయి. ఇది కచ్చితంగా నటుడిగా చైతూని ఓ మెట్టు ఎక్కించే సినిమా. ఇక, సమంత ఎప్పటిలాగా అద్భుతంగా నటించింది.
పెళ్లికి ముందు ప్రేమలో విఫలమై మనసు గాయపడిన భర్తతో సర్థుకుపోయే పాత్రలో ఒదిగిపోయింది.సెకాంఢాప్’లోవచ్చే ఎమోషనల్ సీన్స్ సమంత నటన సినిమాకే హైలైట్. చైతూ-సమంతలు తమ నటనతో సినిమాకి ఊపిరిపోశారు.

కొత్త అమ్మాయి దివ్యాంశ కౌశిక్ గ్లామర్ తో అలరించింది. అలాగే నటనతో ఆకట్టుకుంది. రావు రమేష్, పోసానిల నటన బాగుంది. మిగితా నటీనటులు తమ తమ పరిథిలో బాగానే నటించారు.

సాంకేతికంగా :

బలమైన ఎమోషన్స్ తో కూడిన కథకి నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాలి. అప్పుడే అది ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. నిజంగానే థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమా స్థాయిని పెంచేశాడు. మణిరత్నం సినిమాల రేంజ్ లో నేపథ్య సంగీతాన్ని అందించాడని చెప్పవచ్చు. విష్ణు శర్మ ఫోటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ఇదో ఎమోషనల్ మజిలీ. ప్రతి ఒక్కరు సినిమాతో ఏదో ఒక చోట కనెక్ట్ అవుతారు. తమ జీవితంలోకి తొంగి చూసుకొనేట్టు చేస్తుంది.. మజిలీ. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే మజిలీ.

రేటింగ్ : 3.25/5