రివ్యూ : ఎన్టీఆర్-మహానాయకుడు


చిత్రం : ఎన్టీఆర్-మహానాయకుడు (2019)

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్.. తదితరులు

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

రిలీజ్ డేట్ : 22ఫిబ్రవరి, 2019

రేటింగ్ : 3/5

తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన క‌థానాయ‌కుడు ‘యన్‌.టి.ఆర్‌’. రాజకీయాల్లోనూ తెలుగోడి తెగువని ఢిల్లీకి చూపించారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ప్రజల కోసం సరికొత్త సంక్షేమ పథకాలని తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఆయన జీవిత కథ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అద్భుతమైన సినిమా అనిపించుకొంది. కానీ, కమర్షియల్ గా ఆడలేడు. ఇక రెండోభాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎలాసాగింది ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.. ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, సినీ ప్రస్థానం, పొలిటికల్ ఎంట్రీ మొత్తాన్ని ‘రామన్న కథ’ అంటూ ఒక పాటలో ఆరేడు నిమిషాల్లో చూపించాడు దర్శకుడు క్రిష్. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కథ ఎక్కడైతే ఎండ్ అయిందో.. అక్కడ నుంచి ‘మహానాయకుడు’ చిత్రాన్ని ప్రారంభించాడు. తెలుగుదేశం పార్టీ ప్రకటన, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకొన్న తీరు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆయన పడిన తపన కళ్లకి కట్టినట్టు చూపించారు. మరోవైపు, నాదెండ్ల భాస్కరావు వెన్నుపోటు ఏపీసోడ్, చంద్రబాబు పాత్ర, బసవతారకం, ఎన్టీఆర్ మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ ని హైలైట్ చేస్తూ సినిమా సాగింది.

ప్లస్ పాయింట్స్ :

* బాలకృష్ణ, విద్యాబాలన్ ల నటన

* కథనం

* ఎమోషన్స్ సీన్స్

* సంగీతం

మైనస్ పాయింట్స్ :

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

‘ఎన్టీఆర్-కథానాయకుడు’ మంచి సినిమా అనిపించుకొంది. ప్రశంసలు అందుకొంది. ఐతే, కమర్షియల్ గా ఆడలేదు. దీనికి కారణం సినిమాలో ఎమోషన్స్ మిస్సవడమే అనే విమర్శలొచ్చాయ్. ఐతే, రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడుకి ఎమోషన్స్ టచ్ చేశాడు దర్శకుడు. ఎక్కడ సుత్తి లేకుండా.. నేరుగా కథలోకి వెళ్లిపోయి.. ఎమోషన్స్ టచ్ చేస్తూ కథని ముందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో ఎన్టీఆర్ జీవితంలోని ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. అది ప్రేక్షకులకి నచ్చింది. అందుకే కథానాయకుడు కంటే మహానాయకుడు చాలా బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక, బాలయ్య నటనకి వంకపెట్టలేం. ఐతే, యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్య ఆకట్టుకోలేదనే విమర్శలొచ్చాయ్. మేకప్ సరిగ్గా సెట్ కాలేదని చెప్పుకొన్నారు. మహానాయకుడులో మాత్రం తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. ఎన్టీఆర్ బాగా నమ్మిన వ్యక్తి నాదెండ్ల భాస్కరావు. ఆయన ఎన్టీఆర్ వెన్నుపోటు పొడుస్తాడు. ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలందర్నీ తన వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి అవుతాడు. దీంతో రగిలిపోయిన ఎన్టీఆర్ ఢిల్లీ పీఠాన్ని కదిలించి రాష్ట్రపతిని కలిసి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతాడు. ఈ ఏపీసోడ్ లో బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. తెరపై ఉన్నది ఎన్టీఆర్ నే అనే ఫీలింగ్ కలిగింది.

ఆఖరి దశలో బసవతారకం, ఎన్టీఆర్ మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ లా ఉన్నాయి. బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయింది. చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి నటన బాగుంది. కాకపోటే ఫేస్ లో ఒకటే ఎక్స్ ప్రెషన్. చంద్రబాబు మొహంలోనూ ఎక్స్ ప్రెషన్స్ కనిపించవు. రానా కూడా అదే ఫాలో అయ్యాడు. ఐతే, సినిమాలో చంద్రబాబుని హీరోని చేసి చూపించారు. ఎన్టీఆర్ ఢిల్లీపై పోరాడుతున్న టైంలో తన తెలివితో ఎమ్మెల్యేలని కాపాడినట్టు చూపించారు. ఇక, మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :
ఎం.ఎం కీరవాణి అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ కీరవాణి మార్క్ స్పష్టంగా కనిపించింది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయ్. ఎన్టీఆర్ లోని శక్తియుక్తులను తెలిపేలా డైలాగ్స్ ఉన్నాయి. వాటికి థియేటర్స్ లో చప్పట్లు పడుతున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ఎక్కడ బోరింగ్ సన్నివేశాలు లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : కథానాయకుడు బాగున్నాడు. అయినా.. కమర్షియల్ గా ఆడలేదు. దీనికి కారణం సినిమాలో ఎమోషన్స్ మిస్ అవ్వడం. ఐతే, మహానాయకుడు లో మాత్రం ఎమోషన్స్ మిస్సవ్వలేదు. ప్రేక్షకుడు కంటతడి పెట్టుకొనే సన్నివేశాలు ఉన్నాయి. తెలుగు ప్రజలు గర్వంతో కాలరెగిరేసే సన్నివేశాలున్నాయ్. మొత్తంగా కథానాయకుడులో మిస్సయింది మహానాయకుడులో ఉంది.

రేటింగ్ : 3/5