రివ్యూ : పేటా – అసలు సిసలైన రజనీ సినిమా

చిత్రం : పేటా (2019)

నటీనటులు : రజనీకాంత్‌, సిమ్రాన్‌, త్రిష, నవాజుద్దీన్ సిద్దికీ, విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు

సంగీతం : అనిరుద్

దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజు

నిర్మాత : సన్ పిక్చర్స్‌ (తెలుగు – వల్లభనేని అశోక్)

రిలీజ్ డేటు : 10జనవరి, 2019.

రేటింగ్ : 3/5

అభిమానులు పండగ చేసుకొనేలా ఓ మాస్ మసాలా సినిమాని అందివ్వాలని సూపర్ స్టార్ రజనీకాంత్ చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కబాలి, కాలా సినిమాలు తీశారు. ఐతే, ఈ రెండు సినిమాలు రజనీ అభిమానులని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి. 2.ఓ బ్లాక్ బస్టర్ హిట్టైనా.. అది టెక్నికల్ సినిమా. దీంతో అభిమానుల్లో ఏదో తెలియని లోటు. అరె.. పాత రజనీకాంత్ ని చూసి ఎన్నాళ్లయిందే. అసలు సిసలైనా రజనీ సినిమా ఎప్పుడుస్తోందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. రజనీ తాజా చిత్రం ‘పేటా’తో ఆ ఎదురు చూపులకి తెరపడిందా ? అన్నది రివ్యూలో చూద్దాం.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేటా తెరకెక్కిఈంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్‌సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమాని తెలుగులోకి నిర్మాత వల్లభనేని అశోక్ తీసుకొచ్చారు. సంక్రాంత్రి కానుకగా తెలుగు ‘పేటా’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరీ.. పేటా రజనీ అభిమానుల దాహాన్ని పూర్థిస్థాయిలో తీర్చిందా.. ? అసలు సిసలైన రజనీ సినిమా అనిపించుకొందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

కాళీ (రజిని కాంత్) ఓ హాస్టల్ లో వార్డెన్ గా పని చేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్ హీలర్ గా పనిచేసే సిమ్రాన్ తో కాళీకి పరిచయం ఏర్పడుతుంది. హాస్టల్ వార్డెన్ గా సాదాసీదా జీవితం గడుపుతున్న కాళీపై ఓ గ్యాంగ్ దాడి చేస్తుంది. ఈ దాడితో కాళీకి ఓ ప్లాష్ బ్యాక్ ఉందని తెలుస్తోంది. కాళీ అసలు పేరు పేట. ఉత్తరప్రదేష్ నుంచి వచ్చాడని తెలుస్తోంది. ఇంతకీ పేట కాళీగా ఎందుకు మారాడు ? కాళీ ప్లాష్ బ్యాక్ ఎంటీ.. ?? సింహాచలం (నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ), పేటకు మధ్య గొడవ ఏంటి.. ? కథతో త్రిష, విజయ్ సేతుపతి సంబంధం ఏంటన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

* రజినీ, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీల నటన

* కథానుసారం వచ్చే ఒకట్రెండు ట్విస్టులు

* నేపథ్య సంగీతం

* సినిమాటోగ్రఫీ

* డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

* హీరో-హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్

* కథలో కొత్తదనం లేకపోవడం

* అక్కడక్కడ సాగదీత

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో అనూహ్యమైన మలుపులుంటాయి. ఐతే రజనీ ‘పేటా’ కోసం దర్శకుడు పాత కథనే ఎంచుకొన్నాడు. దానికి రజనీ కోటింగ్ ఇచ్చాడు. అంటే రజనీ నుంచి అభిమానులు కోరుకొనే అన్నీ అంశాలని అద్దుకొంటూ వెళ్లాడు. దాంతో పాటు తనమార్క్ ట్విస్ట్ లు ఇవ్వడం మర్చిపోలేదు. మొత్తంగా బాషాని మించిపోయేలా పేటాని రెడీ చేసి తీసుకొచ్చాడు. రజనీ అభిమానులకి విందు భోజనం పెట్టేశాడు. మిగితా వారికి మాత్రం రొటీన్ సినిమా అనిపించొచ్చు. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌లతో నడిపించిన కార్తీక్‌, ద్వితియార్థంలో కాస్త తడబడినట్టు అనిపించింది.

సూపర్ స్టార్ రజనీ నటనకి వంకపెట్టలేం. 90లో రజనీకాంత్ కనిపించాడు.స్టైలిష్ నటనతో అదరగొట్టేశాడు. చాలా రోజుల తర్వాత అసలు సిసలైన రజనీకాంత్ సినిమా చూపించాడు. ప్రతి ఫ్రేము మాస్. అది సగటు రజనీ అభిమాని పండగ చేసుకొనే రేంజ్ లో ఉంది. నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, విజయ్ సేతుపతిల నటన బావుంది. హీరోయిన్స్ త్రిష, సిమ్రాన్ లని ఇంకా వాడుకోవాల్సి ఉంది. లవ్ ట్రాక్ ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

అనిరుధ్ అందించిన పాటలల్లో మాస్ మరణ.. వినడానికి, తెరపై చూడ్డానికి అదిరిపోయింది. మిగితా పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతంలో మాత్రం అనిరుధ్ మేజిక్ చూపించారు. తిరు సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకొచ్చింది. కొన్ని సన్నివేషాలు సాగదీసినట్టు అనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : రొటీన్ కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఐతే, రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా తెరకెక్కించాడు దర్శకుడు.
భాషా, నరసింహ చిత్రాల రేంజ్ లో రజనీ మాస్ యాంగిల్ ని ప్రజెంట్ చేశారు. మొత్తంగా ఇది అసలు సిసలైన రజనీ సినిమాగా చెప్పవచ్చు. ఐతే, తెలుగు ప్రేక్షకుడు తమిళ వాసన భరించక తప్పదు.

రేటింగ్ : 3/5