రివ్యూ : ‘రా.. రా..’

చిత్రం : ‘రా.. రా..’ (2018)
నటీనటులు : ​శ్రీకాంత్‌, నజియా
సంగీతం : రాప్‌ రాక్‌ షకీల్‌
నిర్మాత : ఎం. విజయ్‌
రిలీజ్ డేటు : 23 ఫిబ్రవరి, 2018.
రేటింగ్ : 2/5

సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్, సపోర్టింగ్ రోల్స్.. ఎలా ఎన్ని టర్న్స్ తీసుకొన్నా.. హీరోగా మాత్రం నాటౌట్ కొనసాగుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘రా.. రా..’. శ్రీకాంత్ కు ఇది 125వ సినిమా. ఆయన తొలిసారి హారర్ జానర్ ని టచ్ చేసిన చిత్రమిది. నజియా హీరోయిన్. విచిత్రమేమిటంటే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ? అనేది తెలీదు. టైటిల్స్ లోనూ దర్శకుడు పేరు వేయడం లేదు. నిర్మాత-దర్శకుడుకి వచ్చిన గొడగవల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారమ్. ఐతే, ఈ సినిమాకు టాప్ దర్శకుడు దర్శకత్వం వహించినట్టు సమాచారమ్. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీకాంత్ ‘రా.. రా..’ ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకొంది ? అసలు ‘రా.. రా..’ కథేంటీ తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
రాజ్‌ కిరణ్‌ ( శ్రీకాంత్‌) తండ్రి ( గిరిబాబు) గొప్ప దర్శకుడు. గిన్నిస్‌ బుక్‌లో రికార్డు కెక్కుతాడు. ఆయన చేసిన 100 సినిమాల్లో ఒక్కటి తప్పా మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ నే. దీంతో.. ఆయన తనయుడు రాజ్ కిరణ్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయితే నిర్మాతలు క్యూ కడతారు. ఐతే, రాజ్ కిరణ్ చేసిన సినిమాలన్నీ ప్లాపులుగా తేలిపోతుంటాయి. ఈ క్రమంలో తనయుడుతో ఓ సినిమాని నిర్మాస్తాడు గిరిబాబు. అ సినిమా కూడా అట్టర్ ప్లాపు కావడంతో గుండె పోటుతో మృతి చెందుతాడు.

భర్త మరణంతో కుంగిపోయిన శ్రీకాంత్ తల్లి గుండెకు పోటు వస్తుంది. ఆమెని సంతోష పెట్టడానికొ ఒక్క హిట్ సినిమా తీస్తే చాలనుకొని ఓ సినిమా ప్రారంభిస్తాడు రాజ్ కిరణ్. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలేంటీ ? దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేమిటీ? చివరికు రాజ్ కిరణ్ తీసిన సినిమా హిట్టా ? ఫట్టా ?? అనేది మిగితా కథ.

ఎవరెలా చేశారంటే ?
హారర్ జోనర్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. కాసింత భయపెట్టి… కాసింత నవ్విస్తే మినిమమ్ గ్యారెంటీ సినిమా అవుతుంది. దీనికి తోడు కథ-కథనాలు గ్రిప్పింగ్ ఉంటే సూపర్ హిట్ కొట్టొచ్చని చెబుతుంటారు. శ్రీకాంత్ ‘రా.. రా..’లో ఈ రెండు లేవు. దెయ్యాన్ని లవ్‌ చేయడం పాయింటే సరిగ్గా లేదు. ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్‌ ఉండదు. దీనికి తోడు.. దెయ్యాల్లో కూడా కామెడీ దెయ్యాలుంటాయని చూపించి ప్రేక్షకుడి సహనానికి మరింత పరీక్ష పెట్టారు. సీనియర్ హీరో అయి ఉండి శ్రీకాంత్ ఇలాంటి కథని ఎంచుకోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు.

ఇక, నటనలో శ్రీకాంత్ కు వంక పెట్టలేం. ఆయన నటన ఒక్కటే ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్సు. మిగితా వన్నీ మైనస్సులే. హీరోయిన్ నజియా ఫర్వాలేదనిపించింది. వేణు, పోసాని, రఘుబాబు, రఘు కార్మంచి, షకలక శంకర్‌, వేణు, పృథ్వీ, గెటప్‌ శ్రీను నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ విజయవంతం కాలేదు. మిగితా నటీనటులు ఓకే అనిపించారు.

సాంకేతికంగా :
అసలు ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలీదు. నిర్మాత-దర్శకుడు మధ్య తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా టైటిల్స్ లో దర్శకుడు పేరు వేయలేదు. నిజానికి దర్శకుడు పేరు వేయకపోవడం అతడికి మంచిదేమో.. ! వేసివుంటే ఆ దర్శకుడికి మరో అవకాశం చచ్చినా వచ్చి ఉండేది కాదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ సో..సో గానే ఉన్నాయి. సినిమాటోగ్రపీ సాదాసీదాగానే అనిపించింది. కొన్ని సీన్స్ కి కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.

బాటమ్ లైన్ : ‘రా.. రా..’ వెఌతే భరించడం కష్టమే !

రేటింగ్ : 2/5