రివ్యూ : సిల్లీ ఫెలోస్

చిత్రం : సిల్లీ ఫెలోస్

నటీనటులు : సునీల్, అల్లరి నరేష్, పూర్ణ , చిత్రశుక్ల

సంగీతం : శ్రీ వసంత్

దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు

నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి

రిలీజ్ డేటు : 07సెప్టెంబర్, 2018.

రేటింగ్ : 2.5/5

కామెడీ హీరోలు అల్లరి నరేష్, సునీల్ కలిసి నటించిన చిత్రం ‘సెల్లీ ఫెలోస్’. దానికి తగ్గుట్టుగానే కామెడీ డబుల్ ఉంటుందని ప్రేక్షకులు ఆశించారు. టీజర్, ట్రైలర్ ని చూస్తే మరింత ఆశ కలిగింది. పైగా ‘సుడిగాడు’ సూపర్ హిట్ ఇచ్చిన భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సెల్లీ ఫెలోస్’ తెరకెక్కడం మరో ప్లస్ పాయింట్. ఐతే, నరేష్, సునీల్ ఇద్దరిపై ప్లాప్ ఫెలోస్ గా ముద్రపడిపోయింది. ఆ ముద్రని ‘సిల్లీ ఫెలోస్’ చెరిపోస్తారనే ప్రచారం జరిగింది. మరీ.. అది జరిగిందా.. ? ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సిల్లీ ఫెలోస్ ఎలా ఉన్నారు.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

జానకి రాం (జయప్రకాశ్‌రెడ్డి) రాజకీయ వేత్త. కులాంతర వివాహాలు చేయిస్తుంటాడు. వీరబాబు (అల్లరి నరేష్) సురిబాబు (సునీల్) ని
బలవంతంగా ఒప్పించడంతో పుష్ప (నందిని) అనే రికార్డింగ్ డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకొంటాడు. ఐతే, సురిబాబు అప్పటికే కృష్ణవేణి (పూర్ణ)తో ప్రేమలో ఉంటాడు. దీంతో.. నందినితో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకొంటాడు. ఇదిలా కొనసాగుతుంటే.. వీరబాబు ఎస్పై ఉద్యోగంలో చేరాలనే కోరికతో ఉన్న వాసంతి (చిత్ర శుక్ల)తో ప్రేమలో పడుతాడు. ఇక, జాకెట్ జానకి రాంకు ఓ మినిస్టర్ చనిపోతూ తను దాచిన 500 కోట్ల గురించి చెబుతాడు. ఇంతకీ పుష్ఫకు విడాకులు ఇవ్వాలనుకొన్న సురిబాబు ప్రయత్నం నెరవేరిందా.. ? కృష్ణవేణితో సురిబాబు పెళ్లి జరిగిందా? వాసంతి, వీరబాబు ప్రేమ కొలిక్కి వచ్చిందా ? 500 కోట్ల రూపాయల ఆచూకి దొరికిందా ? అనేది మిగితా కథ.

ఎలా ఉందంటే ?

ఓ వైపు తన కామెడీతో ప్రేక్షకులని గిలిగింతలు పెడుతూ.. మరో వైపు కంటతడి పెట్టించే కథనంతో భీమినేని శ్రీనివాస్ రావు అదరగొట్టేవాడు. ఐతే, సిల్లీ ఫెలోస్ లో ఆ మార్క్ మిస్సయింది. రొటీన్ కథ, రొటీన్ కామెడీ తో సాధాసీదాగా సాగింది సినిమా. జాకెట్ జానకీరాం జయప్రకాష్ సేవా కార్యక్రమాలు, వాటిని దెబ్బకొట్టే ప్రయత్నాలు అనే పాయింట్ సిల్లీగా ఉంది. సురిబాబును వీరబాబు పెళ్లికి ఒప్పించడంతో కథపై ఆసక్తి పెరిగింది. డబ్బు, బంగారం కోసం ఆశపడిన సురిబాబుకు పుష్ప కష్టాలు మొదలవ్వడం, ఇంతలో వీరబాబు, వాసంతి ప్రేమ ట్రాక్ తో సినిమా సాగింది. ఈ రెండు ట్రాక్ ల మధ్య రూ. 500కోట్ల వ్యవహారం.. మరింత గంగదరగోళానికి గురిచేసింది.

ఎవరెలా చేశారంటే ?

ఇద్దరు కామెడీ హీరోలు సినిమాలో ఉన్నారంటే.. కామెడ్ డబుల్ అవుతుందని ఆశపడ్డారు ప్రేక్షకులు. ఐతే, ఇద్దరు హీరోలు రొటీన్ కామెడీతో సిల్లీగా అనిపించారు. సునీల్‌కు సురిబాబు క్యారెక్టర్ కొత్తేమీ కాదు. రెగ్యులర్ పాత్రలోనే మరోసారి కనిపించాడు. ఆయన డైలాగ్ టైమింగ్ బాగుంది. ఐతే, ఈ సినిమా వలన సునీల్ కు కలిగిన కొత్త ప్రయోజనం ఏమీ లేదు.

అల్లరి నరేష్‌ కూడా విజయం కోసం మొహం వాచిపోయి ఉంది. ఒక్క సక్సెస్ పడితే కెరీర్ ఊపుందుకొంటుంది అనే టైంలో సిల్లీ ఫెలోస్‌ను నరేష్ ఎంచుకోన్నారు. వీరబాబు పాత్ర నరేష్‌కు పరమ రొటీన్ పాత్రే. సక్సెస్‌ను ఆశించే బలమైన పాత్ర కాకపోవడం ఆయనకు మైనస్ అనిపిస్తుంది. హీరోయిన్స్ నందినిరాయ్, చిత్ర శుక్ల, పూర్ణ ఫర్వాలేదనిపించారు. వీరిలో శుక్ల స్పెషల్ అనిపించింది.

సాంకేతికంగా :

కథ-కథనాలు మోస్తారుగా ఉన్నప్పుడు టెక్నికల్ అంశాలు అద్భుతంగా కుదిరితే సినిమాని కొద్దిగా నిలబెట్టవచ్చు. సిల్లీ ఫెలోస్ విషయంలో అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. టెక్నికల్ అంశాలు అదిరిపోయే రేంజ్ లో ఏమీ లేవు. శ్రీ వసంత్ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం డల్ గా అనిపించింది. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలకు కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5