రివ్యూ : స్పైడర్

Spyder

చిత్రం : స్పైడర్ (2017)
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
సంగీతం : హరీశ్ జైరాజ్
దర్శకత్వం : ఎ.ఆర్.మురుగ‌దాస్
నిర్మాత : ఎన్‌.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్, 2017.
రేటింగ్ : 3.25/5

దర్శకుడు మురగదాస్ సినిమా.. ఓ బ్రాండ్. ఓ సామాజిక అంశాన్ని కథగా తీసుకొని కమర్షియల్ సినిమాగా తీయడంలో దిట్ట. అలాంటి దర్శకుడి చేతిలో బాండ్ లాంటి మహేష్ బాబు పడితే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది ? అనే ఆసక్తి నెలకొనడం సాధారణం. ఇప్పుడు ‘స్పైడర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. మురగదాస్ – మహేశ్ ల కలయికలో తెరకెక్కిన ‘స్పైడర్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘స్పైడర్’ దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరీ.. ‘స్పైడర్’ అభిమానుల అంచనాలని అందుకొన్నాడా.. ? ఇంతకీ ‘స్పైడర్’ కథేంటీ ?? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :
శివ (మహేష్ బాబు).. ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో ఫోన్ టాపింగ్ ఆఫీసర్. ప్రమాదం జరిగాక నేరస్తుల్ని పట్టుకునే బదులు.. ఆ ప్రమాదం జరగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తూ ఉంటాడు శివ. ఈ క్రమంలో చాలామందిని ఆపదల నుండి కాపాడుతూ ఉంటాడు. విపరీతమైన మానసికస్థితి కలిగిన భైరవుడు (ఎస్. జె సూర్య) ప్రమాదకరంగా తయారై జనాలని చంపుతుంటాడు. ఓ హత్య కేసులో భైరవుడు శివ దృష్టిలో పడతాడు. భైరవుడిని శివ ఎలా ఎదుర్కొన్నాడు ? ఇంతకీ భైరవుడి మానసిక స్థితి ఎలాంటిది ?? మనుషుల్ని బైరవుడు ఎలా ? ఎందుకు ?? చంపుతుంటాడు ? చివరికి భైరవుడి ఆపడంలో శివ సక్సెస్ అయ్యాడా.. ? అనేది మిగితాకథ.

ప్లస్ పాయింట్స్ :
* కథ – కథనం
*మహేష్ బాబు, ఎస్. జె సూర్యల నటన
* నేపథ్య సంగీతం
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్
* సెకాంఢాప్
* కామెడీ

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు మురగదాస్ ఎంచుకొనే కథలు బాగుంటాయి. ‘స్పైడర్’ కథ కూడా సూపర్భ్. మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం.. స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు ? ఏం చేస్తాడు ? అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు ? అనే అంశాలని చాలా బాగా చూపించారు. ఆ పాత్రలో ఎస్. జె సూర్య చూపించిన విలనీజం అదిరిపోయింది. ఈ మధ్యలో వచ్చిన విలన్ పాత్రలో ఇదే గొప్పదని చెప్పుకొంటున్నారు.

ఈసారి మహేష్ కొత్తగా కనిపించాడు. రెగ్యులర్ స్టార్ హీరోలా కాకుండా కథకు ప్రాధాన్యమిచ్చి సినిమా చేసినట్టు కనిపిస్తోంది. విలన్ గా నటించిన ఎస్ జె సూర్య పాత్రతో పోలిస్తే మహేష్ పాత్రని చాలా సింపుల్ గా డిజైన్ చేసినట్టు కబనడుతోంది. బహుశా.. కోలీవుడ్ లో మహేష్ కు స్పైడర్ తొలి చిత్రం కావడంతో.. చాలా సింపిల్ గా ఎంట్రీ ఇప్పిద్దామని దర్శకుడు అలా చేసి ఉంటాడు. అలాగని మహేష్ తగ్గాడని కాదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు. హీరో – విలన్ మధ్య నడిచే సంభాషణలు, పోరాట సన్నివేశాలు బ్రిలియంట్ గా ఉన్నాయి. సెకండాఫ్’లో వచ్చే హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి గ్లామర్ ఆకట్టుకొంది. ఆమెకు పెద్దగా నటించే స్కోప్ లేదు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :
ఫస్టాఫ్ లో విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం. ఆయనెందుకు అలా తయారయ్యాడు. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించారు. కథలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో, విలన్స్ మధ్య సాగే సంభాషణలు, యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. సెకాంఢాఫ్ లో యాక్షన్ అదిరిపోయింది. అదే సమయంలో సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంటుంది. ఇది సినిమా స్థాయిని కాస్త తగ్గించిందని చెప్పాలి.

హరీజ్ జయరాజ్ అందించిన పాటలు సో..సో గానే ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. సంతోష్ శివన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉంచారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఆ క్రెడిట్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ దే. కీలక సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా :
‘స్పైడర్’లో కథ – కథనాలు బాగున్నాయి. మహేష్ నటన బాగుంది. విలన్ గా చేసిన ఎస్ జె సూర్య నటన అంతకంటే బాగుంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అయితే, మహేష్ రెగ్యూలర్ స్టార్ హీరోలా కాకుండా కథకి ప్రాధాన్యం ఇచ్చి ఈ సినిమా చేసినట్టు కనబడుతోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులు ఏ మేరకు స్వీకరిస్తారన్నది స్పైడర్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే.. సెకాంఢాఫ్ కాస్త డల్ అనిపించడం. కామెడీ మిస్సవ్వడం వంటివి ప్రేక్షకుడికి నిరాశని కలిగించవచ్చు. అయితే, మహేష్ కొత్తగా కనిపించడం, అదిరిపోయే యాక్షన్ సీన్స్. అందులోనూ సోషల్ మెసేజ్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశాలున్నాయి.

బాటమ్ లైన్ :
స్పైడర్.. ఫస్టాఫ్ ‘స్పై’సీగా.. సెకాంఢాఫ్ డ(ర్)ల్ గా ఉంది.

రేటింగ్ : 3.25/5